ఆదోనిలో బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ

ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో మంగళవారం ఒక బ్యాంకు ఉద్యోగి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగులగొట్టి బీరువాలోని రూ. 1,50,000 నగదు, ఆరు గ్రాముల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలను అపహరించుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్టణ పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్