ఆదోని పరిధిలోని ఇస్వీ సమీప రైల్వే బ్రిడ్జిపై శనివారం ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. డ్రైవర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, స్టీరింగ్ వీల్ కట్ అవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ బస్సు విద్యార్థుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని డిపో ట్రాఫిక్ ఇన్ఛార్జి మల్లికార్జున తెలిపారు.