బుధవారం దిబ్బనకల్లు గ్రామంలో జరగనున్న బాల్య వివాహాన్ని ఆదోని సబ్ డివిజన్ శక్తి టీం అడ్డుకుంది. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, కౌన్సెలింగ్ నిర్వహించడంతో వివాహాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, తాలూకా పోలీసులు, ఐసీడీఎస్ సూపర్వైజర్, వీఆర్‌ఓ, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.