ఆదోనిలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న శక్తి టీం

ఆదోని పట్టణంలోని ఫారిస్‌మొహల్లాలో బాల్య వివాహం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో, శనివారం సబ్ డివిజన్ శక్తి టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, దాని దుష్పరిణామాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో, ఆదోని 2 టౌన్ సీఐ ఆధ్వర్యంలో మరోసారి కౌన్సిలింగ్ చేసి వివాహాన్ని రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం మహిళా పోలీస్ రాజేశ్వరి, కానిస్టేబుల్ నాగరాజు, సూపర్వైజర్ లీలావతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్