ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం ఆదోని జిల్లా సాధన జేఏసీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సోమప్ప సర్కిల్ లో మానవహారం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలోని వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని జేఏసీ నాయకులు కమలే గణేష్, కన్వీనర్ శేఖర్, కో కన్వీనర్ కృష్ణ తెలిపారు.