ఆదోని మండలంలోని పెద్దహరివనం గ్రామంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు భూపాల్ చౌదరి, గర్జప్ప, నరసరెడ్డి, బసవరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు.