ఆదోనిలో చోరీ.. నగదు, బంగారం ఎత్తుకెళ్లన దొంగలు

కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం దొంగలు హల్‌చల్ సృష్టించారు. పట్టణంలోని వైఎస్సార్ నగర్‌లో జాను ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న సుమారు 6.5 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదుతో పాటు 11 తులాల వెండి విగ్రహం, 5 తులాల వెండి ఆభరణాలు దొంగిలించబడ్డాయని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై ఆదోని టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్