ఆదోనిలో ఒకే రోజు రెండిళ్లలో చోరీలు

ఆదోని పట్టణంలో మంగళవారం రెండు వేర్వేరు చోట్ల చోరీలు జరిగాయి. తిరుమలనగర్‌లో బ్యాంకు ఉద్యోగి రాము ఇంట్లో తాళం పగులగొట్టి దొంగలు రూ. 1.5 లక్షల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. రాము తన తండ్రి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. అలాగే సాయినగర్‌లో రాజు ఇంట్లో రూ. 20 వేల నగదు, 2 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్