ఆదోని జిల్లా కోసం మహిళల దీక్ష

ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మహిళలు చేపట్టిన ఆందోళనలు గురువారానికి 47వ రోజుకు చేరుకున్నాయి. తిరుమల నగర్ కాలనీ మహిళలు ర్యాలీగా వచ్చి కోట్ల కూడలి దీక్షా శిబిరంలో తమ నిరసన తెలిపారు. జిల్లా సాధన జేఏసీ మహిళా నాయకురాళ్లు లలిత జితేంద్ర, ఉషారాణి మాట్లాడుతూ, పశ్చిమ ప్రాంతాల అభివృద్ధికి ఆదోని జిల్లా అత్యవసరమని, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్