ఆళ్లగడ్డ: టీడీపీలోకి 20 కుటుంబాల చేరిక

ఆళ్లగడ్డ క్యాంపు కార్యాలయంలో బుధవారం, రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ సర్పంచ్ చికిరి చిన్న వెంకటన్న, ఆకుల నాగరాజుతో పాటు పలువురు కార్యకర్తలను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, పారదర్శక పాలనపై విశ్వాసంతో టీడీపీ వైపు వలసలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్