ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరులో సోమవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 20 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. కోత మిషన్ పనిచేస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, పంట పూర్తిగా కాలిపోయింది.