ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మెప్మా రిసోర్స్ పర్సన్లకు కంపోస్టు బిన్లను శనివారం పంపిణీ చేశారు. పెరటి తోటలు, ఇంకుడు గుంతల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.