నెల్లూరు పర్యటనలో జగన్‌ను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం చేసిన హంగామా శ్రద్ధగా పథకం వేసిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. టీడీపీ నేతలకు జగన్ పేరు వినగానే గుబులు వస్తుందన్నారు. ఆళ్లగడ్డలో వైసీపీ హయాంలో రూ.98 కోట్లతో రోడ్లు నిర్మించామని, అవసరమైతే అఖిలప్రియకు పూర్తి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.