ఆళ్లగడ్డ సద్దాం కాలనీకి చెందిన రాజా హుసేని బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మృతుని నివాసానికి చేరుకుని, పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో భూమా కుటుంబం అండగా ఉంటుందని, ఏ అవసరం ఉన్నా సంప్రదించాలని భరోసా ఇచ్చారు.