ఆళ్లగడ్డ తాలూకా జనసేన నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుల ఆదేశాల మేరకు, చింతకుంట గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. నీటి సంఘం డైరెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం లక్ష మందికి పైగా పింఛన్లు ఆపిందని, ప్రస్తుతం అర్హులకు పింఛన్లు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తోందని తెలిపారు.