ఆళ్లగడ్డ శాంతినగరంలో గురువారం పీఎం సూర్యఘర్ పథక అవగాహన సమావేశం నిర్వహించారు. ఇంటిపై సౌర పలకలు ఏర్పాటు చేసుకున్న వారికి రూ. 78, 000 వరకు సబ్సిడీ లభించనున్నదని ఏడిఈ సుబ్రమణ్యం తెలిపారు. గ్రామస్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.