ఆళ్లగడ్డలోని కడప రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ కొరతను కూటమి ప్రభుత్వ వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. ప్రజలు ఇంధన కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.