శ్రీశైలంలో భక్తుల రద్దీ.. 70 వేల మందికి పైగా దర్శనం

జ్యోతిర్లింగ శక్తిపీఠమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం సుమారు 70 వేల మంది స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్లు సమాచారం. ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి మినహా వసతి గదుల కోసం పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కేటాయించిన సమయానికి క్యూలైన్ల వద్దకు చేరుకుని సహకరించాలని ఈవో శ్రీనివాసరావు భక్తులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్