నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు ఉదారత చాటుకున్నారు. శిథిలమైన ధ్వజ స్తంభం స్థానంలో హైదరాబాద్ నివాసి బచ్చు శివ శంకర్ రెడ్డి రూ. 50,000 విరాళం అందించారు. దుద్దెకుంట శివారెడ్డి సుమారు రూ. 1,20,000 వ్యయంతో నూతన ధ్వజస్తంభాన్ని విరాళంగా సమకూరుస్తున్నారు. వెన్నపూస ఎరికల రెడ్డి జ్ఞాపకార్థం రూ. 25,000, ఎస్. శివ శంకర్ రెడ్డి రూ. 26,116, మాజీ సర్పంచ్ రవి చంద్రుడు రూ. 10,116 విరాళాలు అందించారని ఆలయ శివ ట్రస్టు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామస్థులు భక్తుల సేవలను కొనియాడారు.