అహోబిలంలో నూతన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ

ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఏపీ రీ సర్వే ప్రాజెక్టు కింద నూతన పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, గత ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా, ఎవరి ఫోటోలు లేకుండా రాజముద్రతో పాసుబుక్కులు పంపిణీ చేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్