డోన్: ఖాకీ ముసుగులో లిక్కర్ దందా.. సీఐపై కేసు

డోన్‌లో ఎక్సైజ్ సీఐ వరలక్ష్మిపై అక్రమ మద్యం విక్రయ ఆరోపణలు వెలుగుచూశాయి. వివిధ కేసుల్లో సీజ్ చేసిన 381 మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ప్యాపిలి మండలం పిర్‌పల్లి గ్రామానికి చెందిన సోమనాథ్ కారులో తరలిస్తుండగా నైట్ బీట్ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో సీఐ పాత్ర బయటపడటంతో, క్రైమ్ నెంబర్ 54/26 కింద సోమనాథ్‌ను A1గా, సీఐ వరలక్ష్మిని A2గా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్