రుద్రవరం మండలం చిత్రేనిపల్లిలోని శ్రీలక్ష్మి శ్రీనివాస ఆగ్రోస్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 బస్తాల యూరియాను మండల వ్యవసాయ అధికారి సుమతి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న యూరియా విలువ రూ. 13,325గా అంచనా వేశారు. నిబంధనలు ఉల్లంఘించిన డీలర్‌పై 6ఎ కేసు నమోదు చేసినట్లు వ్యవసాయ అధికారి తెలిపారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, అక్రమ నిల్వలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.