ఆళ్లగడ్డలో రేపు సోమవారం మెగా జాబ్ మేళా

ఆళ్లగడ్డలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (DSDO) శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో పది ప్రముఖ కంపెనీలు పాల్గొని, పదో తరగతి ఆపైన చదివిన నిరుద్యోగ యువతీ యువకులను ఎంపిక చేయనున్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 24 వేల వరకు వేతనం లభించనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్