కర్నూలు పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తుకు పునాదని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.