డోన్ టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజావేదికలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రజల నుండి నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలపై సమస్యలను స్వీకరించారు. ఈ వినతులను పరిశీలించి సంబంధిత శాఖలకు వెంటనే సూచనలు జారీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని, ఎప్పుడైనా సమస్యలు తెలియజేయవచ్చని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.