డోన్ మండలం మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులు తాగునీరు, రహదారులు, పింఛన్లు, విద్యుత్, వైద్యం వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, శిథిలమైన ఉరి వాకిలి స్థానంలో నూతన నిర్మాణం కోసం రూ. 25 లక్షల ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.