నంద్యాల: ట్రిపుల్ ఐటీలకు 295 మంది విద్యార్థుల ఎంపిక

ఆంధ్రప్రదేశ్ రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) 2026-27 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల తాత్కాలిక జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 44,104 దరఖాస్తుల్లో 4,040 మంది ఎంపికయ్యారు. నంద్యాల జిల్లా నుంచి 190, కర్నూలు జిల్లా నుంచి 105 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. ఎంపికైన వారిలో అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు ఆయా క్యాంపస్‌లలో కౌన్సెలింగ్ జరగనుంది. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్