కర్నూలు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీఎస్ఏ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నంద్యాల పట్టణవాసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. నంద్యాల ఫిట్‌నెస్ టైమ్ జిమ్ మాస్టర్ హాజీ ప్రోత్సాహంతో పాల్గొన్న ఇద్దరు మహిళలు బంగారు పతకాలు, మరొకరు కాంస్య పతకం సాధించారు. 68 కేజీల విభాగంలో జీ రేణుక 202 కేజీలు లిఫ్ట్ చేసి స్వర్ణం, 63 కేజీల విభాగంలో మనీష 210 కేజీలు లిఫ్ట్ చేసి స్వర్ణం, 83 కేజీల విభాగంలో నరసింహారావు 285 కేజీలు లిఫ్ట్ చేసి కాంస్యం గెలుచుకున్నారు. విజేతలకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధికారులు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రానున్న పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని క్రీడాకారులకు జిమ్ మాస్టర్ హాజీ ఆకాంక్షించారు.