అహోబిలంలో నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నంద్యాల జిల్లా అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం స్వామివారు పొన్న చెట్టు వాహనంపై ఊరేగనున్నారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామికి నవకళశ స్నపన తిరుమంజనం నిర్వహించి, పూలమాలలతో అలంకరించారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్