ఎన్టీఆర్ భరోసా: ఆళ్లగడ్డలో పింఛన్ల పంపిణీలో సరికొత్త ఒరవడి

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నిర్ణీత గడువు కంటే ఒక రోజు ముందుగానే, శనివారంనాడు పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ప్రభుత్వం ముందుగానే నిధులను విడుదల చేయడంతో, ఆళ్లగడ్డలోని సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుండే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. నెల రాకముందే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ డబ్బులు ఇస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్