శిరివెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ జంటకు సంబంధించిన ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో అవాస్తవ వార్తలు ప్రచురించవద్దని పోలీసులు శనివారం స్పష్టం చేశారు. కౌన్సిలింగ్ అనంతరం యువతిని నంద్యాల వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించే క్రమంలో గుంపు అడ్డుపడి రాయి విసిరిన ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు స్వల్ప గాయం అయ్యిందని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.