కర్నూలు, నంద్యాల జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మహానంది మండలంలోని తిమ్మాపురం, అబ్బీపురం, పుట్టుపల్లెతో పాటు పలు గ్రామాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ఉరుములు, బలమైన గాలులతో అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గాలుల వల్ల పంట నష్టపోయిన రైతులు, మరోసారి వాతావరణ మార్పులతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.