ఆత్మకూరు మండలం కొట్టాలచెరువుకు చెందిన చెంచు మహిళ పులిచెర్ల నాగమ్మకు తిరుపతిలో జరిగిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభలో అరుదైన అవకాశం లభించింది. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా తమ కుటుంబానికి కలిగిన ప్రయోజనాలను వేదికపై వివరించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆమెను శాలువాతో సత్కరించారు.