రుద్రవరం‌లో రూ. 49 లక్షల సీసీ రోడ్ల ప్రారంభం

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం టౌన్‌లో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ రూ. 49 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు సీసీ రోడ్లను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని, రుద్రవరం అభివృద్ధికి తొలి విడతగా రూ. 2. 63 కోట్లు, రెండో విడతగా రూ. 2. 40 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్