నంద్యాల గిద్దలూరు జాతీయ రహదారిలో అభయారణ్యంలో వెలసిన శ్రీ సర్వ లక్ష్మీనరసింహస్వామికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయమంతా భక్తులతో కిటకిటలాడింది. ఆలయమంతా గంటలతో ఘన ఘన మోగించారు. ఉదయాన్నే స్వామివారికి పూలాభిషేకం, తీర్థాభిషేకం , కుంకుమార్చన అభిషేకాలు ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ, రంగనాయకులు పూజా కార్యక్రమం నిర్వహించారు.