క్రీడలు విద్యతో సమానం: డాక్టర్ సుజాత

ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, విద్యతో పాటు క్రీడలను కూడా పిల్లలకు అలవాటు చేయాలని సూచించారు. పట్టణంలోని ఆర్ఆర్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నలుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. వీరిలో ఇద్దరు బాలికలు కూడా ఉండటం తనకు సంతోషాన్ని కలిగించిందని, కోచ్ సుబ్బారాయుడు క్రీడాకారులను తీర్చిదిద్దడంలో తన ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను, వారి కోచ్ ను డాక్టర్ సుజాత అభినందించారు.

సంబంధిత పోస్ట్