రాష్ట్ర ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు కుమార్తె మృతి

రాష్ట్ర ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు కుమార్తె మాధురి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన రాజేశ్ తో ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడు నెలల క్రితం ఆమెను తల్లిదండ్రులు తమ వద్దకు తీసుకెళ్లారని రాజేశ్ చెప్పారు. మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు మాధురి తనకు మెసేజ్ పంపిందని, గర్భిణి అయిన ఆమెను చంపి ఆత్మహత్యలా చూపిస్తున్నారని రాజేశ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.

సంబంధిత పోస్ట్