ఆర్బీసీ డ్రైవర్‌ను అవమానించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని గురువారం ఆళ్లగడ్డ జేఏసీ కన్వీనర్ బీరువాల భాష డిమాండ్ చేశారు. ముస్లిం డ్రైవర్ టోపీ తీయాలని చెక్‌పోస్ట్ సిబ్బంది చెప్పడాన్ని మతసామరస్యానికి విఘాతం కలిగించేదిగా పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు పేర్కొన్నారు.