నంద్యాల జిల్లా ఉయ్యాలవాడలో గంగ జాతర సందర్భంగా బుధవారం రాత్రి ప్రదర్శించిన ‘సైరా నరసింహారెడ్డి’ నాటకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నరసింహారెడ్డి చేసిన పోరాటాన్ని కళాకారులు హృద్యంగా ప్రదర్శించారు. ఈ నాటకాన్ని వీక్షించడానికి ఆర్. పాంపల్లి, బోడెమ్మనూరు, సుద్ధమల్ల, పడిగెపాడు, నర్సిపల్లె వంటి పలు గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో జాతర ప్రాంగణం సందడిగా మారింది.