వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు నేటి నుంచి జూన్ 1 వరకు విఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నాలుగు రోజులు భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యమని ఆయన వెల్లడించారు.