సంజామల: కుందూ నదిలో పడి మహిళ మృతి

సంజామల మండలం కమలపురి గ్రామానికి చెందిన దాసరి వెంకటలక్ష్మమ్మ కుందూ నదిలో పడిమృతి చెందారు. కుమారుడు బాలవెంకటేశ్వర్లుతో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై వంతెన దాటుతుండగా నదిలోకి జారి పడిపోయారు. బాలవెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడగా, వెనుక ద్విచక్రవాహనంపై వస్తున్న మరో కుమారుడు తిరుపతయ్య తల్లిని ఒడ్డుకు చేర్చాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్