ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాలలో పీజీఆర్ఎస్ హాల్స్ నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, HIV ఒక వ్యాధి మాత్రమేనని, రోగులపై వివక్ష చూపరాదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా, ఏఎన్ఎంలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.