మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బేతంచెర్లలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమం, తాగునీటి సమస్యపై 'చలో నగర పంచాయతీ' నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని విమర్శించారు.