తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలిగా గుడిసె ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకారం

కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా గుడిసె ఆది కృష్ణమ్మ గురువారం కర్నూలు ఎం.ఆర్.సి. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పచ్చరపల్లి వాల్మీకి నాయకులు కృష్ణమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం, పార్టీ కోసం పదవి ఒక గౌరవం అయితే, ప్రజల సేవ ఒక బాధ్యత అని, ఆ బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చే నాయకురాలు కృష్ణమ్మ అని వారు కొనియాడారు. సమస్య వినగానే స్పందించే నాయకురాలు కృష్ణమ్మ అని దేవరాజు, రాజశేఖర్, శ్రీనివాసులు, జనార్ధన, శివకుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్