ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకేసులో బుధవారం మరో ఏడుగురిని అరెస్టు చేసినట్టు జిల్లా అదనపు ఎస్పీ హుసేన్ పీరా వెల్లడించారు. ఆలూరు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఇప్పటికే 10 మందిపై కేసు నమోదు కాగా, వారిలో నలుగురిని రిమాండుకు తరలించారు. విచారణలో మొత్తం 15 మంది పాత్ర ఉందని తెలిపారు.