ఆలూరు: యువకుడికి అరగుండు కొట్టించి, చెప్పుల దండ వేసి

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో బుధవారం, వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ యువకుడికి గ్రామస్థులు అరగుండు కొట్టించి, చెప్పుల దండ వేసి, గ్రామంలో ఊరేగించారు. బాధితురాలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పడంతో, గ్రామస్థులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, ఈ శిక్ష విధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్