ఆలూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, మెకానికల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి పాసై లేదా పాలిసెట్ రాసిన విద్యార్థులు ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రిన్సిపాల్ ఎం. వెంకటనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసేందుకు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు తీసుకురావాలని అన్నారు.