ఆలూరు: కేజీబీవీ నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు జిల్లాలోని కేజీబీవీల్లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష అడిషినల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ లోకరాజ్ ప్రకటన విడుదల చేశారు. ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే-నైట్ వాచ్మెన్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్, వర్డెన్, పార్ట్ టైం టీచర్, చౌకిదార్ వంటి వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తులను ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం rvmssakumool.blogspot.com ను సందర్శించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్