ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి మాధవరం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం చిప్పగిరిలోని తన నివాసంలో మాట్లాడుతూ, చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటాన్ని చూసి టీడీపీ వర్గాలు దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.