ఆలూరు: నేడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాక

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈనెల 11, 12 తేదీల్లో కర్నూలులో పర్యటించనున్నారు. 11న ఆలూరు నియోజకవర్గంలో, 12న పత్తికొండ నియోజకవర్గంలో జరిగే మహాసభల్లో ఆయన పాల్గొంటారని జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహించి, జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చిస్తారని పేర్కొన్నారు. సభలకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు, పార్టీ సభ్యులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్